![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -437 లో.....కావ్య జ్యూస్ తీసుకొని వస్తుంది. తన చేత్తో అక్కర్లేదని అపర్ణ అంటుంది. అందరు నన్నే అనండి.. మీ అబ్బాయి మీరు ఇలా కావడానికి కారణం నేనే అన్నారని కావ్య చెప్తుంది. పళ్ళు రాలగొడతాను నాకు ఇలా జరగడానికి వీడి తండ్రి కారణం. ఒకరు చేసిన తప్పు కి ఇంకొకరి బాధ్యుల్ని చేస్తే ఎలా, నిజం తెలిసినప్పుడు, ఆ బాధ మాటల్లో చెప్పలేనిదని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత కావ్య జ్యూస్ ఇచ్చి వెళ్తుంది. ఇన్ని రోజులు తండ్రి కోసం చేసిన త్యాగాలు చాలు. నా మనసు ముక్కలు అయినట్టు.. నీ పెళ్ళానికి కాకుండా చూసుకోమని రాజ్ తో అపర్ణ అనగానే.. అయితే ఏం చేయమంటావని రాజ్ అడుగగా.. నీ పెళ్ళాన్ని పట్టించుకోరా అని అపర్ణ చెపుతుంది. ఆ తర్వాత కావ్య చీర కట్టుకుంటుంటే అప్పుడే రాజ్ వచ్చి గట్టిగా అరుస్తాడు. కావ్య రాజ్ కి దగ్గరగా వచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది. అదేంటి ముద్దు ఇస్తున్నావని రాజ్ అడుగగా.. నా భర్తకి నేను ఇస్తే తప్పేంటి.. మరి మీరు ఇవ్వండని కావ్య అంటుంది. ఇప్పుడు పూజ పెట్టుకొని ఇదేంటి అని రాజ్ అనగానే.. అయ్యో అవును కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అపర్ణ ఆరోగ్యం బాగైందని ఈ పూజ జరిపిస్తున్నామని సుభాష్ అనగానే.. చేసిన తప్పంతా చేసి ఇప్పుడు ఎన్ని అంటే ఏం లాభమని ఇందిరాదేవి తిడుతుంటే.. కావ్య సర్ది చెప్పుతుంది. ఆ తర్వాత అనామిక పేరెంట్స్ ఇంటికి వస్తారు. వాళ్ళను ఎవరు పిలిచారని ధాన్యలక్ష్మి అంటుంది. నేనే పిలిచాను పూజకి వచ్చినట్లు ఉంటుంది. అలాగే అత్తయ్య గారిని చూసినట్టు ఉంటుందని అనామిక అంటుంది. అనామిక పేరెంట్స్ అపర్ణని పలకరిస్తారు.
ఆ తర్వాత కాసేపటికి కనకం ఫ్యామిలీ వస్తుంది. కనకం బాగున్నారా వదిన అని అపర్ణని పలకరిస్తుంది. అపర్ణ ఎప్పుడు లేని విధంగా కనకం వాళ్ళతో మర్యాదగా మాట్లాడి కూర్చోమని చెప్పి కావ్యని పిలిచి కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. నేనే వీళ్ళని రమ్మని చెప్పానని అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నువ్వు కట్టుకున్న చీరేం బాలేదు.. ఈ ఇంటి పెద్ద కోడలు ఖరీదైన చీరలు కట్టాలి.. రాజ్ తనకి రేపు షాపింగ్ కి తీసుకొని వెళ్ళమని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత పూజ దగ్గరకి రమ్మని కావ్య పిలుస్తుంది. పూజలో ఎక్కువ సేపు కూర్చొలేనని అపర్ణ చెప్పగానే.. మీ భర్త కూర్చొవచ్చు అనగానే సుభాష్ కూర్చుంటాడు. అపర్ణ కోపంగా వద్దని చెప్తుంది. సుభాష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో మీరు అత్తయ్య గారితో మనసు విప్పి మాట్లాడండి అని సుభాష్ తో కావ్య చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |